97 ఏళ్లుగా... అద్దె భవనాలే దిక్కు
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:02 AM
ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం అందిస్తున్న ముదినేపల్లిలోని సబ్ – రిజిస్ట్రార్ కార్యాలయాన్ని దశాబ్దాల తరబడి అద్దె భవనంలోనే నిర్వహిస్తు న్నారు.
సొంత భవనం లేని ముదినేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ముదినేపల్లి, డిసెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం అందిస్తున్న ముదినేపల్లిలోని సబ్ – రిజిస్ట్రార్ కార్యాలయాన్ని దశాబ్దాల తరబడి అద్దె భవనంలోనే నిర్వహిస్తు న్నారు. పురాతన కాలంనాటి పాత భవనం అరకొర సౌకర్యాలతో ఉన్నప్పటికీ ఆ భవనంలోనే కార్యాలయాన్ని కొనసాగిస్తు న్నారు. వర్షాకాలం ఆ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు నెదుర్కొం టున్నారు. కార్యాలయ ఆవరణ కూడా అధ్వానంగా ఉంటుంది. ముదినేపల్లిలో ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని 1927 జూన్ 4న ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి అద్దె భవనంల్లోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పురాతన భవనంలో ఈ కార్యాలయంలో 60 ఏళ్లుగా కొనసాగుతోంది. గతంలో ఏడా దికి లక్షల్లో వచ్చిన ఆదాయం ఇప్పుడు కోట్లకు పెరిగింది. గత నాలుగేళ్లుగా ఏడాది కి ఈ కార్యాలయంలో జరిగే భూముల, స్థ లాలు, గృహాల రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి సగటున రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్ఱేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యాలయానికి సొంతభవనం నిర్మాణం విషయంలో ఏ చర్యలు తీసుకోవడం లేదు. ముదినేపల్లిలో అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయా లకు సొంత భవనాలు ఉండగా సబ్ –రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రమే అద్దె భవనంలో ఉంది. మండల కార్యాలయాల సముదా యాల ఆవరణలో సబ్ – రిజిస్ట్రార్ కార్యా లయానికి భవనాన్ని నిర్మించాలని స్థల సేకరణకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. సబ్ – రిజిస్ట్రార్లు పలువురు గతంలో తహసీల్దార్ల ద్వారా కలెక్టర్‌కు తమ కార్యా లయానికి స్థలాన్ని కేటాయించాలని పంపి న వినతులు బుట్టదాఖలయ్యాయి. కూట మి ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత గూడు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దాత ఇచ్చిన స్థలం వృథాగా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మా ణానికి పదిహేనేళ్ల కిందట స్థలం కొను గోలు చేసి కొల్లి రాంబాబు అనే దాత రిజి స్ట్రేషన్ చేసి విరాళంగా ఇవ్వగా, ఆ స్థలం అనువుగా లేదని భవన నిర్మాణాలు చేపట్ట లేదు. ఆ స్థలం వృథాగా ఉంది.