క్యాపిటల్ ఆసుపత్రితో రిపబ్లిక్ ఆఫ్ వనాటు ఒప్పందం
ABN , Publish Date - Mar 31 , 2024 | 04:47 AM
విజయవాడ సమీపంలోని పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి, రిపబ్లిక్ ఆఫ్ వనాటు దేశ ప్రతినిధుల మధ్య ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే ఒప్పందం కుదిరింది.
పెనమలూరు (కృష్ణాజిల్లా), మార్చి 30: విజయవాడ సమీపంలోని పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి, రిపబ్లిక్ ఆఫ్ వనాటు దేశ ప్రతినిధుల మధ్య ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని క్యాపిటల్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ హరీష్ మన్నే తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ వనాటు ఆరోగ్య మంత్రి జాన్ స్టిల్ తారికేటు, వనాటు ప్రభుత్వ ఎంపీ డాన్ కెన్, ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు డాక్టర్ సుందర్ శనివారం క్యాపిటల్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డయాలసిస్ కోసం టెలి మెడిసిన్ సేవలకు ఒప్పందం కుదుర్చుకున్నామని డాక్టర్ హరీష్ తెలిపారు. ఏడేళ్లుగా కృష్ణాజిల్లాలో మూడు లక్షల మంది లబ్ధిదారులకు సేవలందిస్తూ విజయవాడలోని ఉత్తమ ఆసుపత్రుల్లో తమ ఆసుపత్రి ఒకటిగా నిలిచిందన్నారు. మెడికల్ టూరిజంలో విజయవాడను ఉత్తమ గమ్యస్థానాల్లో ఒకటిగా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆసుపత్రిలోని అన్ని సౌకర్యాలను గమనించిన వనాటు ప్రభుత్వ ప్రతినిధులు అన్ని రకాల మెడికల్, సర్జికల్ సేవలకు క్యాపిటల్ ఆసుపత్రిని తమ ఎంప్యానెల్ ఆసుపత్రిగా చేయడానికి అవసరమైన అనుమతుల కోసం వారి ప్రభుత్వానికి సిఫారసు చేశారని మెడికల్ డైరెక్టర్ వి.సురేష్‌కుమార్ తెలిపారు.