Roads are flooded : రోడ్లు జలమయం - ప్రగతికి గ్రహణం
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:22 PM
బద్వేలు రోడ్లు దయనీయంగా మారాయి, వైసీపీ ప్రభు త్వం మంజూరు చేసిన రూ. 130 కోట్ల ప్రగతికి గ్రహణం పట్టింది. మూడు పంచాయతీలుగా ఉన్న బద్వేలు మున్సిపాలిటీగా పురోగతి చెంది 14 ఏళ్లు దాటి రెండు పాలకవర్గాలుపూర్తయి, మూడో పాలకవర్గంలో నడుస్తున్నా వార్డుల్లో రహదారు లు, మురుగు కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చినుకు పడితే ప్రధాన వార్డుల్లో రహదారులపై సైతం వర్షపునీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహి స్తుంటాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
చినుకుపడితే రోడ్లు బురద మయం
రూ.130 కోట్లలో సగం కూడా ఖర్చుకాని వైనం
అవస్థలుపడుతున్న జనం
ప్రజాప్రతినిధులు హీనం
బద్వేలుటౌన్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): బద్వేలు రోడ్లు దయనీయంగా మారాయి, వైసీపీ ప్రభు త్వం మంజూరు చేసిన రూ. 130 కోట్ల ప్రగతికి గ్రహణం పట్టింది. మూడు పంచాయతీలుగా ఉన్న బద్వేలు మున్సిపాలిటీగా పురోగతి చెంది 14 ఏళ్లు దాటి రెండు పాలకవర్గాలుపూర్తయి, మూడో పాలకవర్గంలో నడుస్తున్నా వార్డుల్లో రహదారు లు, మురుగు కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చినుకు పడితే ప్రధాన వార్డుల్లో రహదారులపై సైతం వర్షపునీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహి స్తుంటాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మంజూరైన రూ. 130 కోట్లు నిధులు ఏమయ్యాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అధికారులను అడిగితే సగం నిధులు ఖర్చయ్యాయని చెప్పు కొస్తున్నారు. ప్రజలు మురుగు తో సావాసం చేస్తున్నట్లే వివరాల్లోకెళితే....
రెడ్డెయ్యమఠం వీధిలో అధ్వానంగా రహదారులు
మురుగునీరుపారితే...
చిన్నపాటి వర్షం కురిసినా నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహిం చడం సర్వసాధారణమైంది. కొన్నిచోట్ల కాల్వల్లో పూడికతీత తీయకపోవడం, మరికొన్నిచోట్ల మురుగు కాల్వలు లేకపోవడం తో వర్షంనీరు, మురుగునీరు పోయే మార్గం లేకపోయింది. దీనికితోడు మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర పదార్థా లు పేరుకుపోయాయి. బ్రహ్మంసాగర్ తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరు వృథాగా రోడ్లపై ప్రవ హిస్తోంది. పబ్లిక్ వాటర్, మురుగునీరు నిత్యం రోడ్లపై దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు దోమ లు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 35వార్డుల్లో 58కిలోమీటర్ల మేరకు డ్రైనేజీ కాల్వలు పూర్తిచేయాల్సి ఉండగా వాటిల్లో కొంత మేరకు అంతంత మాత్రమే పూర్తి చేశారు. రూ.130కోట్ల నిధుల్లో రూ.47కోట్లు మాత్రమే ఖర్చుచేయడంతో పట్టణ అభివృద్ధికి గ్రహణం పట్టినట్లైంది. గతం లో జనావాసాలు లేనిచోట్ల వైసీపీ నేతలు పొలా లకు, వారి స్థలాలున్నచోట్ల సీసీ రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. జనావాసాలున్నచోట్ల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో రోడ్లు, కాల్వలు అస్తవ్యస్తం గా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం అభివృద్ధి పనులను ప్రారంభించి మురుగు కాల్వలు, రోడ్లనిర్మాణ పనులను చేపట్టి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.