65 లక్షల మందికి రూ.4,408 కోట్ల పింఛను
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:32 AM
రాష్ట్రంలోని 65 లక్షల మందికి సోమవారం రూ.4,408 కోట్ల పింఛను మొత్తం పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
వలంటీర్లపై త్వరలోనే నిర్ణయం: మంత్రి పార్థసారథి
తిరుమల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 65 లక్షల మందికి సోమవారం రూ.4,408 కోట్ల పింఛను మొత్తం పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుని పింఛను అందజేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పెంచిన వెయ్యితో కలిపి పింఛన్ మొత్తాన్ని కలిపి ఇవ్వబోతున్నట్టు చెప్పారు. వలంటీర్ల విషయంలో ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.