Share News

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:31 PM

మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం
మదనపల్లెలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, సెప్టెంబరు 17: మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు. మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగం గా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుం చి పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, ప్రజ లు కలసి పట్టణంలో ర్యాలీ నిర్వహించా రు.ఈ సందర్భంగా అనిబిసెంట్‌ సర్కిల్‌ వద్ద అందరిచేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన మనూజ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, ఉద్యోగు లు, కార్మికులు పాల్గొన్నారు. మదనపల్లె మండలంలోని 25 గ్రామాల్లో సర్పంచలు, ఎంపీ టీసీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం న్రిర్వహించారు. ఎంపీడీవో భానుప్రసాద్‌, ఇనచార్జి ఈవోఆర్డీ శ్రీహరి, సర్పంచలు చిప్పిలి చలపతి, ఆనంద పార్థసారథి, మహేష్‌, దీప, కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: ములకలచెరువులో మంగళవారం స్వచ్చత హీ సేవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షు డు పాలగిరి సిద్ధా, ఎంఈవో వెంకటరమ ణ, ఏవో గౌస్‌బాష, పంచాయతీ కార్య దర్శులు ఇబ్రహీం, ప్రశాంత, టీడీపీ నాయీబ్రహ్మణ సెల్‌ అధ్యక్షుడు కేశవులు. సచివాలయ సిబ్బంది, విద్యార్ధులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అలాగే దేవళచెరువు, బురకాయలకోటలో నిర్వహించిన ర్యాలీ, మానవహారంలో రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, టీడీపీ నేతలు ముత్తుకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, విజయ్‌కుమార్‌ హాజరయ్యారు.

నిమ్మనపల్లిలో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చత హీ సేవా ద్వారా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంపీడీవో రమేష్‌ పేర్కొన్నారు. ఈ సంధర్బంగా అధికారులు, విద్యార్ధులచే ర్యాలీ, మానవహారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరమణ, మల్లికార్జున, మల్లప్ప తదితలరు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: మండలంలో స్వచ్ఛత సేవా 2024 అవగాహన ర్యాలీ ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఎంఈవో మనోహర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచలు, కార్యదర్శులు, విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.

తంబళ్లపల్లెలో: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఎంపీడీవో సురేంద్రనాథ్‌ అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అధికా రులు, కూటమి నాయకులు విద్యార్థులతో కలసి తంబళ్లపల్లెలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నేతలు సిద్దమ్మ, పురుషోత్తం, శివకుమార్‌, వెంకటరెడ్డి, సాంబశి వారెడ్డి, రాజారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పుడే రోగాలకు దూరంగా ఉంటారని ఎంపీడీవో వెంకటేశులు అన్నారు. స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైస్కూల్‌ నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. కలకడలో:పరిసరాల పరిశుభ్రత గ్రామాల్లో ప్రజలందరి బాధ్యత అన్ని ఎంపీడీవో పరమే శ్వరరెడ్డి అన్నారు. కలకడ మంగళవారం ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులతో కలిసి స్వచ్ఛతాహి సేవ నిర్వహించారు.

వాల్మీకిపురంలో: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వాల్మీకిపురం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫైరోజాబేగం పేర్కొన్నారు. స్వచ్చతాహి సేవా కార్యక్ర మంలో మంగళవారం ఆస్పత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది కలిసి పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్‌రాజు, డాక్టర్లు మమత, శ్రీలక్ష్మి, హర్షితరెడ్డి, రవికుమార్‌, మొహ్మద్‌ఆసిఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో : మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో స్వఛ్చతాహే కార్యక్ర మాన్ని మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక బృంద సభ్యులు, పంచాయతీ కార్మికులు, అధికారులు సంయుక్తంగా నిర్వహిం చారు. ఎంపీడీవో కేఎన బాలాజీ, సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కురబలకోటలో: మండలంలోని అన్ని పంచాయతీలలో పారిశుధ్యఽం తతలెత్తకుండా చర్య లు చేపట్టనున్నట్లు ఎంపీడీవో హరినారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అన్ని పంచాయతీలలో స్వచ్ఛత హి సేవ ర్యాలీలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ పోరెడ్డి విశ్వనాథరెడ్డి, అయూబ్‌ బాషా, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కలికిరిలో: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు పారిశుధ్యంతోపాటు పచ్చ దనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో గంగయ్య కోరారు. మండలంలో స్వచ్ఛతా సేవ పై అవగాహనా కల్పించారు. కార్యక్రమం లో సర్పంచు ఎల్లయ్య, టీడీపీ నాయకుడు యోగేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: స్వఛ్చతాహీ సేవ కార్యక్ర మంలో భాగంగా బి.కొత్తకోట జ్యోతిచౌక్‌ లో ఎంపీడీవో శంకరయ్య, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్క రూ పరిశుభ్రతను పాటించాలని పిలుపు నిచ్చారు.

Updated Date - Sep 17 , 2024 | 11:31 PM