శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:23 AM
శ్రీశైల మహాక్షేత్రంలోని శుక్రవారం శాస్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించారు. హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్ధిని అమ్మవారికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలతో స్వాత్వికబలిని సమర్పించారు.
అమ్మవారికి గుమ్మడికాయలు, అన్నపు రాశి సమర్పణ
శ్రీశైలం, ఏప్రిల్ 26: శ్రీశైల మహాక్షేత్రంలోని శుక్రవారం శాస్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించారు. హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్ధిని అమ్మవారికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలతో స్వాత్వికబలిని సమర్పించారు. ఉత్సవంలో భాగంగా పసుపు, కుంకుమ రాసులను సమర్పించి అమ్మవారికి శాంతి ప్రక్రియ క్రతువును పూర్తిచేశారు. ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జుస్వామివారికి అన్నాభిషేకం చేసి ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సింహమండపం వద్ద అన్నాన్ని కుంభరాశిగా పోశారు. ఆ తర్వాత సంప్రదాయాన్ని అనుసరించి స్ర్తీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతిని సమర్పించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు నిజరూప అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రామరి అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.