Share News

చెయ్యి నొప్పెట్టకుండా..!

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:36 AM

మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నది పాత సినిమాలో ఫేమస్‌ డైలాగు. చేస్తున్న పనికి కొంత క్రియేటివిటీ ఉపయోగిస్తే శ్రమతగ్గి మెరుగైన ఫలితం వస్తుంది.

చెయ్యి నొప్పెట్టకుండా..!

డిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నది పాత సినిమాలో ఫేమస్‌ డైలాగు. చేస్తున్న పనికి కొంత క్రియేటివిటీ ఉపయోగిస్తే శ్రమతగ్గి మెరుగైన ఫలితం వస్తుంది. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మొక్కజొన్న పొత్తులు కాల్చి విక్రయించేవాళ్లు బొగ్గులను విసనకర్రతో విసురుతూ మండించి పొత్తులను కాల్చడం మనం చూస్తూనే ఉంటాం. విసనకర్ర విసిరి

విసిరి చెయ్యి నొప్పెడుంతుందో ఏమో... కాస్తంత క్రియేటివిటీతో ఆలోచించి ఓ చిన్న ఫ్యాన్‌ను ఉపయోగించి బొగ్గులను మండించి మొక్కజొన్న పొత్తులను కాలుస్తోంది ఈ పెద్దమ్మ. విశాఖలోని ఆర్కే బీచ్‌రోడ్డులో కనిపించిందీ దృశ్యం.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 21 , 2024 | 04:37 AM