రాష్ట్రానికి సీనియర్ ఐఏఎస్ పీయూ్‌షకుమార్
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:45 AM
కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూ్‌షకుమార్ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన్ను ఏపీకి పంపించాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూ్‌షకుమార్ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన్ను ఏపీకి పంపించాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు రాష్ట్రానికి తిరిగి పంపించేందుకు కేం ద్ర కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉదయం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను అతలాకుత లం చేసేశారు. దానిని సంస్కరించి గాడిలో పెట్టే పనిలో భాగంగా ఆర్థిక శాఖ బాధ్యతలు మొత్తం ఆయనకే అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.