టికెట్ ధరలు పెంచకుండా ప్రయాణికులకు సేవలు
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:58 AM
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణరావు అన్నారు.
ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల
విజయవాడ బస్‌స్టేషన్, అక్టోబరు 5: ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణరావు అన్నారు. శనివారం ఆర్టీసీ హౌస్‌లో అభిమానుల కోలాహలం మధ్య ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొనకళ్ల మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. టికెట్ల ధర పెంచకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తామని తెలిపారు. హీరో సమన్ ఈ కార్యక్రమంలో పాల్గొని నారాయణరావుకు అభినందనలు తెలిపారు. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న కొనకళ్లకు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.