Home » APSRTC
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కదిరి ఆర్టీసీ డి పోను జిల్లా ప్రజారవాణాధికారి మధుసూదన ఆదివారం సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు వసతిసౌకర్యాలు, తాగునీరు, కూర్చీలు, ఫ్యాన్లు, పరిశుభ్రతను పరిశీలించారు
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణరావు అన్నారు.
దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది.
అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.
గుర్రంకొండ పట్టణం నుంచి మదనపల్లె, అంగళ్లు, వాల్మీకీపురం పట్టణాల్లో పాఠశాలలు, కళాశాల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు సమయానికి సకాలంలో బస్సులు లేక పడరా నిపాట్లు పడుతున్నారు.
తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.
ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం డిపోలో నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.