Share News

రేపటి నుంచి ‘సేవా పక్వాడా’

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:01 AM

దేశ ప్రధాన సేవకుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వరకు పక్షం రోజుల పాటు రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం తెలిపారు.

రేపటి నుంచి ‘సేవా పక్వాడా’

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాన సేవకుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వరకు పక్షం రోజుల పాటు రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో 17, 18, 19న రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబరు 23న వృద్ధ మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరాలు.. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో 24వరకూ పరిశుభ్రత కార్యక్రమం ఉంటుందన్నారు. సెప్టెంబరు 25న పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంతిని పురస్కరించుకుని పార్టీ బలోపేతానికి సభ్యత్వాలు పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఉంటాయన్నారు. చివరిగా అక్టోబరు 2న జాతీయ నేతల విగ్రహాలు, దేవాలయాలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నాగభూషణం వివరించారు.

Updated Date - Sep 16 , 2024 | 03:01 AM