రోడ్లపై మురుగు నీరు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:39 AM
ప్రధాన రోడ్లపైనే మురుగునీరు పారుతుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధర్మవరం రూరల్/ఓబుళదేవరచెరువు, డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): ప్రధాన రోడ్లపైనే మురుగునీరు పారుతుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం పట్టణంలోని మాధవ నగర్‌లోని బలిజ కళ్యాణ మండపం సమీపంలోని మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతోంది. రోడ్డు పక్కనే నిల్వ ఉంటోంది. అలాగే ఓబుళదేవరచెరువులో అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎస్‌బీఐకు ఉన్న రహదారిపై కూడా మురుగు నీరు ప్రవహిస్తోంది. అలాగే మురుగునీరు నిల్వ ఉంటుండటంతో దోమల ప్రభావం వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మురుగునీరు రోడ్లపై పారకుండా.. నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.