Share News

AP Capital : అమరావతి రైతులకు అవమానం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:36 AM

సమస్యలు చెప్పుకొందామని వచ్చిన అమరావతి రాజధాని రైతులపై ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది.

AP Capital : అమరావతి రైతులకు అవమానం

సీఆర్‌డీఏ కార్యాలయంలోకి రాకుండా గేట్లు మూసివేత

వినతిపత్రం ఇవ్వడానికి

కూడా అనుమతి నిరాకరణ గేట్ల దగ్గర బైఠాయించిన రైతులు

ఆందోళనతో దిగివచ్చిన సీఆర్‌డీఏ

విజయవాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సమస్యలు చెప్పుకొందామని వచ్చిన అమరావతి రాజధాని రైతులపై ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది. వినతిపత్రం ఇవ్వటానికి వచ్చిన రైతులను తీవ్ర అవమానానికి గురి చేసింది. సీపీఐ నేతృత్వంలో రాజధాని రైతులు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌కు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు రాగా, వారిని లోపలికి అడుగు పెట్టనీయకుండా గేట్లు మూసేశారు. అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు సీఆర్‌డీఏ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దిగి వచ్చిన సీఆర్‌డీఏ అధికారులు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, మరో నలుగురినే లోపలికి అనుమతించారు. అక్క డ అడిషనల్‌ కమిషనర్‌ అలీం బాషా మాత్రమే అందుబాటులో ఉన్నారు. కమిషనర్‌ అందుబాటులో లేకపోవటంపై రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ‘అమరావతి రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు భూము లు అప్పగిస్తే వారి సమస్యలు వినటానికి కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌కు తీరిక లేదా? రైతులకు కౌలు చెల్లించకుండా బాధపెట్టడం తగదు. అసైన్డ్‌, లంక భూముల రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదు. భూ సమీకరణ ఒప్పందంలో భాగంగా రైతులకు ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. భూమిలేని పేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలి’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అడిషనల్‌ కమిషనర్‌ అలీం భాషా వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. బయట ఉన్న రైతులకు చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో అలీం బాషా బయట ఉన్న రైతుల దగ్గరకు వచ్చారు. కౌలుకు సంబంధించిన వివరాలను సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపించామని, మరోమారు ఆర్థిక శాఖకు ప్రతిపాదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సీపీఐ రాజధాని రైతు జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ‘సంక్రాంతి వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తు న్నాం. సమస్యలను పరిష్కరించకపోతే.. ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతాం’ అని హెచ్చరించారు.

Updated Date - Jan 09 , 2024 | 09:41 AM