Share News

చోరీల సొమ్ముతో షార్ట్‌ఫిల్మ్‌!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:35 AM

ఇంట్లో అందరూ నిద్రించగానే మూడో కంటికి కూడా తెలియకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున లోపు మొత్తం అంతా చక్కబెట్టేస్తాడు. అలా చోరీ చేసిన సొమ్ములతో జల్సాలు చేస్తుంటాడు. చోరీ సొమ్ముతో గతంలో ఓ షార్ట్‌ఫిల్మ్‌ కూడా తీశాడు. ఇదీ.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోరీ కేసు నిందితుడు అప్పలనాయుడు ఘన చరిత్ర!. నిందితుడి నుంచి 75 తులాల

చోరీల సొమ్ముతో షార్ట్‌ఫిల్మ్‌!

సినిమా డైరెక్టర్‌ కావాలన్న లక్ష్యం

90 చోరీ కేసుల్లోని సిక్కోలు నిందితుడి పట్టివేత

75 తులాల బంగారం, నగదు రికవరీ

నారాయణపేట టౌన్‌, జూలై 25: ఇంట్లో అందరూ నిద్రించగానే మూడో కంటికి కూడా తెలియకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున లోపు మొత్తం అంతా చక్కబెట్టేస్తాడు. అలా చోరీ చేసిన సొమ్ములతో జల్సాలు చేస్తుంటాడు. చోరీ సొమ్ముతో గతంలో ఓ షార్ట్‌ఫిల్మ్‌ కూడా తీశాడు. ఇదీ.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోరీ కేసు నిందితుడు అప్పలనాయుడు ఘన చరిత్ర!. నిందితుడి నుంచి 75 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.4 లక్షల నగదును రికవరీ చేసినట్లు తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ వెల్లడించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలను డీఎస్పీ లింగయ్యతో కలిసి ఆయన వివరించారు. అప్పలనాయుడు దొంగతనాల్లో ఆరితేరిపోయాడన్నారు. ఇటీవల మక్తల్‌కు చెందిన చిగుళ్లపల్లి రాఘవేందర్‌ ఇంట్లో 41.5 తులాల బంగారం, మరికల్‌కు చెందిన గౌడపల్లి రాములు ఇంటిలో 20 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెంటి ఆభరణాలు, రూ.4లక్షల నగదు, నారాయణపేటలోని అశోక్‌నగర్‌కు చెందిన అబ్రే్‌షకుమార్‌ ఇంట్లో 2.5 తులాల బంగారం చోరీ చేయడంతోపాటు తాజాగా జరిగిన ఆరు చోరీ కేసుల్లో అప్పలనాయుడు నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఇలా చోరీ చేసిన డబ్బుతో హైదరాబాద్‌, రాయిచూర్‌లలో పేకాట ఆడుతూ, జల్సాలు చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 90 చోరీ కేసుల్లో నిందితుడని చెప్పారు. చోరీ డబ్బుతో గతంలో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశాడని, సినిమా డైరెక్టర్‌ కావాలన్న ఆశ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.

Updated Date - Jul 26 , 2024 | 07:24 AM