Share News

విద్యార్థినిపై సర్పంచ అత్యాచార యత్నం

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:05 AM

ఓ సర్పంచ, మరో ఇద్దరు వైసీపీ నాయకులు కలిసి 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నం చేశారు.

   విద్యార్థినిపై సర్పంచ అత్యాచార యత్నం

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

మరో ముగ్గురు వైసీపీ నాయకులపై కూడా..

కోసిగి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఓ సర్పంచ, మరో ఇద్దరు వైసీపీ నాయకులు కలిసి 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ముగ్గురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యా భర్తలు తన కుమారుడుతో కలిసి కర్ణాటకకు వలస వెళ్లారు. 8వ తరగతి చదువుతున్న తమ కూతురిని తాత వద్ద వదిలారు. గత అక్టోబరు 30వ తేదీన తన తాతతో కలిసి విద్యార్థిని ఇంటి బయటే నిద్రిస్తుండగా గ్రామ సర్పంచ హుశేనీ బాలిక నోరు మూసి బలవంతం చేయబోయాడు. విద్యార్థిని కేకలు వేయడంతో పక్కనే పడుకున్న తాత లేచి హుశేనిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో తాతను తోసేసి సర్పంచ పరారయ్యాడు. సర్పంచకు తోడుగా వచ్చిన వైసీపీ నాయకులు తోవి వినోద్‌, మజ్జిగ సూరీలు కూడా పొలాల్లోకి పారిపోయారు. విద్యార్థిని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కోసిగి పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ హుశేనీ, తోవి వినోద్‌, మజ్జిగ సూరీలపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ మంజునాథ్‌, ఎస్‌ఐ చంద్రమోహన వెల్లడించారు.

Updated Date - Nov 13 , 2024 | 12:06 AM