Share News

నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 30 , 2024 | 11:32 PM

ఆళ్లగ డ్డ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారి స్తున్నట్లు ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ తెలిపా రు.

నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ (శిరివెళ్ల), సెప్టెంబరు 30: ఆళ్లగ డ్డ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారి స్తున్నట్లు ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ తెలిపా రు. మంగళగిరిలోని టీడీ పీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అఖిలప్రియ సీఎం చంద్రబాబునాయుడును సోమవారం సాయంత్రం కలిశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గుర్తించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కనుమరుగైందని అన్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించారు.

Updated Date - Sep 30 , 2024 | 11:32 PM