Share News

త్వరలో సహకార సంస్థలకు ప్రత్యేక అధికారులు

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:43 AM

రాష్ట్రంలోని సహకార సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో నియమించిన కమిటీల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని ఇటీవల సాధారణ ఉత్తర్వులు జారీ చేసింది.

త్వరలో సహకార సంస్థలకు ప్రత్యేక అధికారులు

కొన్ని పాలకవర్గాలు రాజీనామాలు చేయనందునే

అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సహకార సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో నియమించిన కమిటీల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని ఇటీవల సాధారణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో దాదాపు 2,050 పీఏసీఎస్‌, 13 డీసీసీబీ, 13 డీసీఎంఎస్‌, ఆప్కాబ్‌ పాలకవర్గాలు రాజీనామాలు చేయాలని సహకారశాఖ అధికారులు మెమోలు జారీ చేశారు. దీంతో ఆప్కాబ్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, డీసీసీబీలు, డీసీఎంఎ్‌సల కమిటీ సభ్యులు రాజీనామాలు చేశారు. పీఏసీఎ్‌సల త్రిసభ్య కమిటీల్లో అత్యధిక శాతం రాజీనామాలు సమర్పించగా, కొద్ది మంది రాజీనామా లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నటు సమాచారం. సహజంగా ప్రభుత్వం మారినప్పుడు నామినేటెడ్‌ పదవులకు రాజీనామాలు చేయడం నైతికత. కానీ జూలై వరకు ఉండొచ్చన్న ఉద్దేశంతో పలువురు పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కమిటీలను రద్దు చేసి, ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తగిన అధికారులతో సహకారశాఖ జాబితాలు సిద్ధం చేస్తోంది. కాగా, రాష్ట్రంలోని సహకార సంస్థలకు దాదాపు ఏడేళ్ల నుంచి ప్రత్యక్ష ఎన్నికలు జరగలేదు. 2018 జనవరి నుంచి ఏడాదిన్నర వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాత పాలకవర్గాలకు సహకార సంస్థల బాధ్యతలు అప్పగించగా, 2019 జూలై నుంచి వైసీపీ ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన నేతలకు నామినేషన్‌ పద్ధతిలో పగ్గాలు అప్పగించింది. కొత్త ప్రభుత్వం సహకార ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:43 AM