తిరుమలలో ముగిసిన వసంతోత్సవాలు
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:02 AM
మూడు యుగాలకు చెందిన శ్రీనివాస, శ్రీరామ, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం శ్రీదేవి,
తిరుమల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మూడు యుగాలకు చెందిన శ్రీనివాస, శ్రీరామ, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను కూడా ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకెళ్లారు. ముందుగా ఆస్థానం నిర్వహించి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వసంతోత్సవ అభిషేకాదులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తిరిగి సాయంత్రం ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లడంతో వసంతోత్సవాలు ముగిశాయి.