రేపే నింగిలోకి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:04 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్‌ను ప్రయోగించనుంది.
భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-08తో రోదసిలోకి
నేడు షార్‌లో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం
సూళ్లూరుపేట, ఆగస్టు 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. రాకెట్ మూడు దశల అనుసంధానం అనంతరం శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను శాస్త్రవ్తేతలు పూర్తి చేశారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్‌ఆర్) సమావేశం గురువారం షార్‌లో జరగనుంది. ఇందులో ప్రయోగానికి సంబంఽధించిన కౌంట్‌డౌన్ సమయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం లాంచింగ్ ఆఽథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 175.5 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ 3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.