Share News

సీజనల్‌ వ్యాధులపై కట్టుదిట్టమైన చర్యలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:25 AM

రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. గురువారం మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ అధికారులతో సీజనల్‌ వ్యాధులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రచార

సీజనల్‌ వ్యాధులపై కట్టుదిట్టమైన చర్యలు

ఆరోగ్యశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ ఆదేశాలు

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. గురువారం మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ అధికారులతో సీజనల్‌ వ్యాధులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా ప్రబలేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియాపై 24 గంటలూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

Updated Date - Jul 26 , 2024 | 04:25 AM