Share News

ప్రజా సమస్యలపై పోరుబాట : సీపీఎం

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:41 PM

సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఎంపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలపై పోరుబాట : సీపీఎం
పాదయాత్ర చేపడుతున్న సీపీఎం నాయకులు

కోడుమూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఎంపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ డిమాండ్‌ చేశారు. సీపీఎం తలపెట్టిన ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ వీధుల్లో శనివారం పాదయాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలని అన్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లి అకౌంట్‌కు రూ.15వేలు, రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.20వేలు అందించాలన్నారు. ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పడు ట్రూ ఆఫ్‌ చార్జీలంటూ కరెంటు చార్జీలు పెంచడం ప్రజలను మోసం చేసినట్టేనని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 ఇస్తానని ఇంత వరకు అమలు చేయలేదు. అలాగే కోడుమూరులో సమ్మర్‌ స్టోరేజ్‌ నిర్మించి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. మండలంలోని సమస్యలను పరిష్కరించాలని 13వరకు మండలంలోని అన్ని గ్రామాలల్లో పర్యటించి 14న తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గఫూర్‌మియా, రాజు, జేపీ వీరన్న, లక్ష్మన్న, మునుస్వామి, శంకర్‌, బాబు, గిడ్డయ్య, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:41 PM