Share News

వరద బాధితులను ఆదుకోండి

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:11 AM

విజయవాడలో సంభవించిన వరదల మూలంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఐటీ మంత్రి నారా లోకేష్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కోరారు.

 వరద బాధితులను ఆదుకోండి

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 11: విజయవాడలో సంభవించిన వరదల మూలంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఐటీ మంత్రి నారా లోకేష్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాల యంలో బుధవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలోని 47వ డివిజన్‌కు ఇన్‌చార్జీగా ఎమ్మెల్యేను ఐటీ మంత్రి నియమించడంతో ఆమె పర్యటించి వరదల్లో నష్టపోయిన బాధితుల వివరాలను అందించారు. అలాగే ఆళ్లగడ్డలో రాజకీయ ప రిస్థితిని మంత్రికి వివరించినట్లు చెప్పారు.

Updated Date - Sep 12 , 2024 | 12:11 AM