Share News

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 27కు వాయిదా

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:28 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగమైన వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్స్‌(వాన్‌పిక్‌) భూముల కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 27కు వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగమైన వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్స్‌(వాన్‌పిక్‌) భూముల కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చడంపై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును మే 30న ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే.. సీబీఐ తరఫు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో ఆ కేసును జనవరి 27కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Dec 20 , 2024 | 05:28 AM