Share News

ఓటర్‌ నమోదును సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:39 PM

ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం రిటర్నింగ్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు.

 ఓటర్‌ నమోదును సద్వినియోగం చేసుకోండి
ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య

జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య

కల్లూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం రిటర్నింగ్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు. శనివారం కల్లూరు మండలంలో రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులతో కలిసి జేసి 151, 152, 153, 154, 155,170, 169, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా చనిపోయిన వారు ఉంటే ఫారం-7 , కొత్త, మార్పులు చేర్పులకు దరఖాస్తులు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, ఎలక్షన డీటీ అనురాధ, మండల రెవెన్యూ ఇనస్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:39 PM