జగన్ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:07 AM
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిచ్చి చేష్టల వల్ల రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు 30ు పెరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
ఈ డబ్బులు జగన్ తన జేబులో నుంచి ఇవ్వాలి: టీడీపీ
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిచ్చి చేష్టల వల్ల రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు 30ు పెరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ ఖర్చు పెరగడానికి జగనే కారణమని, ఈ డబ్బులు తన జేబులో నుంచి ఇస్తారో ఇవ్వరో ఆయన సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతిపై విద్వేషంతో జగన్ ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇప్పుడు పనులు మొదలు పెట్టేసరికి నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ప్రతి పని ఖర్చూ కనీసం 30 శాతం పెరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ అదనపు ఖర్చుకు ప్రజల డబ్బే ఖర్చు చేయాల్సి వస్తోంది. పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే ఈ అదనపు ఖర్చు ఉండేది కాదు. ఈ సరికి రాజధాని నిర్మాణం పూర్తయి ఉండేది. జగన్ విద్వేషపూరిత వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో రూ.వేల కోట్ల అదనపు భారం పడింది. ఇది ప్రజల దృష్టికి రాకుండా అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ తన మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ మీడియా ఒళ్లు దగ్గర పెట్టుకొని వార్తలు ఇవ్వాలి. జగన్ చెప్పాడని నోటికి వచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేస్తే తీవ్రంగా తీసుకొంటాం. కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడి రాజధాని నిర్మాణం చేస్తుంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఇంకా పాత ఆలోచనలతోనే ప్రయాణిస్తే ఈసారి 11 సీట్లు కూడా రావు’ అని అశోక్ అన్నారు.