-
-
Home » Andhra Pradesh » TDP Chief Nara Chandrababu Ra Kadalira Public Meeting at Venkatagiri Live updates in Telugu psnr
-
Chandrababu Ra Kadalira Live Updates : రా .. కదలిరా బహిరంగ సభలో వైసీపీపై నిప్పులు కురిపించిన చంద్రబాబు
ABN , First Publish Date - Jan 19 , 2024 | 12:27 PM
వెంకటగిరిలో టీడీపీ ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో అధికార వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, ఓటర్లు ఆలోచించుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Live News & Update
-
2024-01-19T13:39:52+05:30
చంద్రబాబు కామెంట్స్...
కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. నిన్ననే ప్రధాన మంత్రిని కలిశాడు. ప్రత్యేక హోదా అడిగాడా? అదేనా విశ్వసనీయత? మద్యపాన నిషేధం తెచ్చాకనే ఓటు అడుగుతానన్నాడు. మద్యం అమ్మకాలపై రూ.36 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు.
సాక్షి పత్రికలో వివేకాది గుండెపోటన్నారు. రక్తం మరకలు ఏమిటంటే వాంతులన్నారు. చివరికి వివేకా కూతురిపైనే కేసు వేసే పరిస్థితికి వచ్చారు. 29 మంది ఎమ్మెల్యేలని మారుస్తామంటున్నారు. మరోసారి మోసం చేసే ప్రయత్నం. కనకపు సింహాసమున శునకమున కూర్చొండబెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే.. ఆ సింహాసనాన్నే నాశనం చేసిందట. అతనో మానసిక రోగ అని తెలుసు, అవినీతికి పాల్పడ్డాడు, జైలుకు వెళ్లాడని అందరికీ తెలుసు.
వెంకటగిరి వైసీపీ ఇన్ ఛార్జి ఇసుక దోపిడీ, గ్రావెల్ దందా, క్వార్ట్జ్ తవ్వకాలు. సూళ్లూరుపేట, గూడూరులోనూ అదే పరిస్థితి. క్లబ్ లో డ్యాన్సులు వేసే వారు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతారు. కాకాణికి మొత్తం నెల్లూరు జిల్లానే కొనేసే పరిస్థితికి వచ్చాడు. రేపు మిమ్మల్నీ కొనేస్తాడు. సత్యవేడు... ఆయనో రబ్బరు స్టాంపు. పెద్దిరెడ్డి ఓ పెద్ద దొంగ. బియ్యపు రెడ్డి హారతి కర్పూరంలా కరిగించేస్తున్నాడు. భూమన మొన్నటి వరకు నాస్థికుడు. ఇప్పుడేమో టీటీడీ ఛైర్మన్. పెద్ద ఆఫీసర్ ఒకాయన స్వామిని అడ్డంపెట్టుకుని పైరవీలు.
-
2024-01-19T13:21:24+05:30
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
తుపానులు, వరదలు వచ్చినప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకున్నాం. రాష్ట్రంలో ఏ కులస్థులైనా బాగున్నారా? ఏ మతస్థులైనా బాగున్నారా? కనీసం రెడ్లు అయినా బాగున్నారా?.. దీనికి ఒక్కటే మార్గం. జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.
యువత కోసం 25 ఏళ్ల కిందట ఐటీ ఆయుధం ఇస్తే, ఇప్పుడదే వజ్రాయుధం అయింది. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్ గా చేద్దామని అనుకున్నాం. ప్రపంచంలోనే మేలైన ప్రాంతంగా చేయాలని చూశాం. ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా చేద్దామని అనుకున్నాం. మంచి పరిశ్రమలు, విద్యాసంస్థలు తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెద్దామని అనుకున్నాం. తెచ్చిన వాటిని ఏం చేశారో చూశాం. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెస్తే, జగన్ నిరుద్యోగం పెంచారు. కియా వంటి పరిశ్రమలు తెస్తే, వాటికే కన్నం వేశాడీ జగన్.
మనం ఐటీ ఉద్యోగాలిస్తే, జగన్ వాలంటీర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్ మార్కెట్ ఉద్యోగాలిచ్చాడు. మనం పరిశ్రమలు తెస్తే జగన్ భూంభూం, ఆంధ్యా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చాడు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారమంతా ఆయనదే.
జగన్ ఓ పెద్ద వ్యాపారి. మనల్ని అందర్నీ దోచుకున్నాడు. ఇసుక తైలం తీసి రూ.కోట్లు దోచాడు. తిరుపతిలో రూ.4వేల కోట్ల పీడీఆర్ బాండ్లు పేరుతో దోచారు. ఏపీ వ్యాప్తంగా రూ.24 వేల కోట్లు దోచారు. తిరుపతి ప్రాంతంలో ఎర్రచందనం ఉంది. ఆ రోజు స్మగ్లింగ్ చేసే వారిపై గట్టిగా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు ఒక్కరినైనా పట్టుకున్నారా? ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు.
అయోధ్యలో రామాలయం నిర్మిస్తే దేశమంతా చూస్తుంది. తిరుమలలో స్వామి ఆలయాన్నీ దోచుకుంటున్నారు. ఆ దేవుడు క్షమించినా మనం క్షమించం.
జగనన్న హౌసింగ్ కాలనీల్లో అవినీతే అవినీతి. రూ.15లక్షలకి ఎకరా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లుకి అమ్మారు.
కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయి. రూ.4500కోట్ల విలువ చేసే సిలికాను ఈ దుర్మార్గులు దోచేశారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. కేజీఎఫ్ త్రీగా మార్చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహారదీక్షకి దిగి పోరాటం చేశారు. అది ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలి. జగన్ 45లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు. ఇసుకంతా దోచేశారు. మొన్న బీచ్ శ్యాండ్ ని అమ్మాలని చూస్తే, కోర్టు ఆపింది.
జగన్ కి ఓడిపోతామనే భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి. జగన్ పోవాలి.
-
2024-01-19T13:19:23+05:30
జిల్లా మారినా వెంకటగిరి పరిప్థితి మారలేదు: చంద్రబాబు
తుగ్లక్ పాలనలో అభివృద్ధి జరగలేదు
శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు భరించాడు
జగన్ వేయి తప్పులు చేశాడు
జగన్‌ను భరించే శక్తి ప్రజలకు ఉందా?
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా?
జగన్ పాలనలో పంక్రాంతి పండగ కూడా సరిగ్గా ప్రజలు చేసుకోలేకపోయారు
నేను అధికారంలో ఉండి ఉంటే సంక్రాంతి కానుక ఇచ్చే వాడిని
ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి
-
2024-01-19T13:10:48+05:30
చంద్రబాబు కామెంట్స్
జగన్ 100 తప్పులు చేశాడు
తుగ్లగ్ పాలనలో అభివృద్ధి జరగలేదు
జగన్ పోవాలి.. అభివృద్ధి జరగాలి
రా.. కదిలిరా అని పిలుపు ఇస్తే వెంకటగిరి గర్జించింది
రాష్ట్రంలో రాజకీయ దృశ్యం మారిపోతోంది
వైసీపీ వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా?
వైసీపీలో ఉండే జగన్ పాలన బాగోలేదని ఆనం చెప్పారు
ఆనం రాంనారాయణరెడ్డికి రాజకీయ చరిత్ర ఉంది
ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టేశారు
సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది
-
2024-01-19T12:58:24+05:30
చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
-
2024-01-19T12:53:11+05:30
వైసీపీ నుంచి బయటకు వచ్చింది ఇందుకే: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
‘‘వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియాలే పెరిగిపోయాయని పోలీసు ప్రోగ్రామ్‌లోనే మాట్లాడాను. మన ప్రభుత్వ విధానం ఇది కాదని అన్నాను. అప్పటినుంచి నేను ఏమి అడిగినా చెత్త బుట్టలో వేయడమే. వెంకటగిరిలో 100 పడకల హాస్పిటల్ అడిగితే బుట్టలో వేశారు. సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువకు నిధులు ఇవ్వాలని అడిగితే బుట్టలో వేశారు. తాగు,సాగు ఇవ్వమంటే అది కూడా బుట్టలో వేశారు. గ్రామపంచాయతీలు, సమితుల డబ్బులు తినేశారు. వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వమంటే నా మీద కక్ష గట్టారు. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్లలో మొట్టమొదటి నేనే వచ్చాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది’’.
-
2024-01-19T12:44:02+05:30
నెల్లూరు జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ. నెల్లూరు జిల్లాలో మరో ఉద్యమం మొదలైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమం మొదలైంది. చంద్రబాబు నాయుడితో తెలుగు దేశంతో నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరే: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
-
2024-01-19T12:38:56+05:30
టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం నిండిపోయింది.
-
2024-01-19T12:26:15+05:30
వెంకటగిరిలో టీడీపీ ‘రా.. కదలిరా..’ బహిరంగ సభా ప్రాంగణానికి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేరుకున్నారు. ఈ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.