Share News

TDP Govt : అమరావతిలో మెగా వాకింగ్‌ ట్రాక్‌

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:21 AM

అమరావతి రాజధానికి గుండెకాయ లాంటి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అదనపు హంగులు అద్దడంతోపాటు.. సందర్శకుల తాకిడిని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

TDP Govt : అమరావతిలో మెగా వాకింగ్‌ ట్రాక్‌

విజయవాడ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి గుండెకాయ లాంటి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అదనపు హంగులు అద్దడంతోపాటు.. సందర్శకుల తాకిడిని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు తరహాలో అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు బఫర్‌ జోన్‌లో అత్యంత పొడవైన వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతి అభివృద్ధి సంస్థ దీనికోసం టెండర్లు కూడా పిలిచింది. అమరావతిలో ఎన్‌-04 జంక్షన్‌ నుంచి ఎన్‌-11 జంక్షన్‌ వరకు రూ.88.31 లక్షల వ్యయంతో మెగా వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు. అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో బిడ్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో 15 మీటర్ల మేర బఫర్‌ జోన్‌కు స్థలాన్ని వదిలారు. ఈ జోన్‌లోనే వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తారు. దీనిలోనే సైక్లింగ్‌ కూడా చేసుకునేలా ఏర్పాటు చేస్తారు.

Updated Date - Sep 20 , 2024 | 05:21 AM