Share News

టీడీపీ కార్యకర్త పంపుసెట్‌ సామగ్రి కాల్చివేత!

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:33 AM

టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లాడని ఆ పార్టీ కార్యకర్తకు చెందిన వ్యవసాయ పంపుసెట్‌ సామగ్రిని వైసీపీ నేతలు దహనం చేశారు.

టీడీపీ కార్యకర్త పంపుసెట్‌ సామగ్రి కాల్చివేత!

లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లాడనే..

కారంపూడి మండలం రెడ్డిపాలెంలో వైసీపీ నేతల దారుణం

కారంపూడి, ఏప్రిల్‌ 20: టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లాడని ఆ పార్టీ కార్యకర్తకు చెందిన వ్యవసాయ పంపుసెట్‌ సామగ్రిని వైసీపీ నేతలు దహనం చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్ల పంచాయతీ రెడ్డిపాలెం గ్రామంలో జరిగిందీ ఘోరం. నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 18న నరసరావుపేటలో నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త కొమ్ము పేరయ్య కూడా హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన వైసీపీ నేతలు.. పేరయ్య పొలంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ బోరు, దానికి అనుబంధంగా ఉన్న 12.5 కేవీ డైనమో, వాటర్‌ పైపులను తగులబెట్టారు. కేబుల్‌ వైర్లను దొంగిలించారు. దీనిపై కారంపూడి పోలీ్‌సస్టేషన్లో పేరయ్య ఫిర్యాదు చేశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్థినష్టం జరిగినట్లు తెలిపారు.

Updated Date - Apr 21 , 2024 | 06:52 AM