టెట్ పరీక్ష ప్రారంభం
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:00 AM
ఉపాధ్యాయ అర్హత(టెట్)పరీక్ష గురువారం ప్రారంభమైంది. జిల్లా విధ్యాశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మొదటి రోజు 145 మంది గైర్హాజర్
కర్నూలు(ఎడ్యుకేషన), అక్టోబరు 3: ఉపాధ్యాయ అర్హత(టెట్)పరీక్ష గురువారం ప్రారంభమైంది. జిల్లా విధ్యాశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష 3వ తేదీ నుంచి ఈ నెల 21వ తేది వరకు కొనసాగుతాయి. జిల్లాలో టెట్ పరీక్షకు మొత్తం 54,083 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో కర్నూలులో 6 హైదరారాబాద్‌లో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలో 40,660 మంది, హైదరాబాద్‌లో 13,423 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మొదటి రోజున కర్నూలులో జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, బృందావన ఇంజనీరింగ్ కశాశాల, దూపాడు సమీపంలోని ఆయాన డిజిటల్ జోన, ఎమ్మిగనూరు సెయింట్ జాన్స ఇంజనీరింగ్ కళశాల, ఆదోని భీమా ఇంజనీరింగ్ కళాశాలోని కేంద్రాల్లో టెట్ పరీక్ష జరిగింది. అలాగే, హైదరాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెషన-1లో పేపర్-2ఏ లాంగ్వేజ్ తెలుగు, కన్నడం, తమిళం, ఒరియా, ఉర్దూ, సంస్కృతం, మధ్యాహ్నం పేపర్-2ఏ పరీక్ష జరిగింది. రెండు సెషన్సలో 1262 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, ఇందులో 1117 మంది పరీక్ష రాయగా, 145 మంది అభ్యర్థులు గైర్హాజర్ అయ్యారు. రాష్ట్ర పరీశీలకులు నరసింహారావు, జిల్లా విద్యాశాఖ అధికారి సామేల్, టెట్ పరీక్ష కేంద్రాలను తనీఖీ చేశారు. పరీక్ష కేంద్రాల డిపార్టుమెంట్ అధికారులు అనలైన పరీక్ష సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 7.30 గంటలకే అభ్యర్థులు తల్లిదండ్రులతోను, బంధువులతోను పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష నిర్వాహకులు కేంద్రాల వద్ద సెల్‌ఫోన్స, బ్యాగులు పెట్టుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులను సిబ్బంది బయటి గేట్‌వద్దనే చెక్ చేసి కేంద్రాలలోనికి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే లోపలికి అనుమతి ఉండదనే నిబంధన అభ్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు వాహనాలను ఏర్పాటు చేసుకొని పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ ఆధికారులు అభ్యర్థుల సౌకర్యార్థమై బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడంతో, ఆటో డ్రైవర్లు అధిక చార్జీలను వసూలు చేశారు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.