దటి జ్ జగన్...
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:22 AM
పూజారి గుడికి పోవాలి! అలాగే... ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లాలి. కానీ... జగన్ తీరే వేరు. కేబినెట్ భేటీ ఉంటే తప్ప ఆయన సచివాలయం గడప తొక్కలేదు. ప్రజల బాధలూ వినలేదు.
సచివాలయానికి వెళ్లని సీఎం
జగన్ సరికొత్త రికార్డు
టీచరు బడికి పోవాలి! పూజారి గుడికి పోవాలి! అలాగే... ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లాలి. కానీ... జగన్ తీరే వేరు. కేబినెట్ భేటీ ఉంటే తప్ప ఆయన సచివాలయం గడప తొక్కలేదు. ప్రజల బాధలూ వినలేదు.
ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల దాకా అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. దీనిని ‘విజిటర్స్ టైమ్’గా పిలుస్తారు.
జగన్ ఒక్కరోజు కూడా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రెండు నెలలు మాత్రమే అయిష్టంగా సచివాలయానికి హాజరయ్యారు.
ఆపై కొన్నాళ్లకే అమరావతిని అటకెక్కించి ‘మూడు ముక్కలాట’కు తెరలేపారు. తర్వాత... తప్పనిసరి తంతు తరహాలో కేబినెట్ సమావేశాలకు మాత్రమే సెక్రటేరియట్‌కు వెళ్లారు.
అది కూడా ఇష్టంలేకుండానే! ‘సీఎం ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు’ అంటూ తాడేపల్లి ప్యాలె్‌సలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైనా బయటకు వెళితే పరదాలు, బారికేడ్లే!
- అమరావతి, ఆంధ్రజ్యోతి