Share News

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:02 AM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖా మంత్రి నారా లోకేశ పట్టుదలగా కృషి చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, అక్టోబరు 5: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖా మంత్రి నారా లోకేశ పట్టుదలగా కృషి చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు విద్యకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఆయన శ్రమిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వ ర్యంలో శనివారం కలికిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ తమ కుటుంబం ఎన్నో ప్రయాసలకోర్చి కలికిరిని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దిందని ఇందులో భాగంగా మూడు పాలిటెక్నిక్‌ కళాశాల లతోపాటు, జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, సైనిక్‌ స్కూల్‌, మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రాధాన్య త ఇచ్చినట్లు వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో మరింత నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సమావేశం అనంతరం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను కిశోర్‌కుమార్‌ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కరీముల్లా, నాగార్జున రెడ్డి, సంఘం నాయకులు విశ్వనాథ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, రవీంద్ర నాథ రెడ్డి, జనార్థన రెడ్డి, శివకుమార్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మాధవి, డి.వెంకట్రమణా రెడ్డి, రామాంజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 12:02 AM