కోచింగ్ సెంటర్ల కళకళ
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:08 AM
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో కర్నూలు నగరంలోని శిక్షణా కేంద్రాలు కళకళలాడుతున్నాయి. డీఎస్సీకి ప్రిపేర్ చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి.
డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,645 ఖాళీలు
ఎస్జీటీ 1791, స్కూల్ అసిస్టెంటు పోస్టులు 854
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో కర్నూలు నగరంలోని శిక్షణా కేంద్రాలు కళకళలాడుతున్నాయి. డీఎస్సీకి ప్రిపేర్ చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి. అక్టోబరు 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ ఆనలైన పరీక్ష జరిగింది. జిల్లాలో 54,083 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే టెట్ ఫలితాలు ఈ నెల 4వ తేదీన విడుదలయ్యాయి. జిల్లాలో దాదాపు 50.95 శాతం మంది డీఎస్సీకి అర్హత సాధించారు. డీఎస్సీ నోటిఫికేషన త్వరలో విడుదల చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటోంది.
ఫ జిల్లాలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు:
ఆరేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రతి యేటా డీఎస్సీ నిర్వహిస్తానని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన గురించి పట్టించుకోలేదు. గత జగన ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసిందంటూ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం 117 జీవోను తీసుకు వచ్చింది. దీని వల్ల ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గిపోయింది. కొత్త పోస్టులు చేపట్టకపోగా 117 జీవోతో ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పెట్టడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఇస్తానని మాట ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారే 16,345 పోస్టులతో మెగా డీఎస్పీపై సంతకం చేశారు.
ఫ త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన:
మెగా డీఎస్సీకి సంబందించి నోటిఫికేషన త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రకటన విడుదల తేదీ నుంచి నెల రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు 2645 ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు 854, ఎస్జీటీ పోస్టులు 1791 పోస్టులు ఉన్నాయి.
ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా ఉచిత డీఎస్సీకి శిక్షణ:
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన జారీ చేస్తుండటంతో బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్, నాన రెసిడెన్షియల్ పద్దతిలో ఉచిత శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తోంది. ఇప్పటికే ఆ శాఖల ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆనలైన దరఖాస్తులు స్వీకరించారు. స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇస్తారు. ఇలా చేయడం పట్ల పేద, మధ్యతరగతి అభ్యర్థులకు పెద్ద ఊరట కలిగింది. ఒక్కొక్క అభ్యర్థికి దాదాపు 20 వేలకు పైగా శిక్షణకు ప్రభుత్వం వ్యయం చేస్తోంది.
ఫ ఆత్మ విశ్వాసంతో చదువుతున్నా -కె.శేఖర్, టీటీసీ:
డీఎస్సీ నోటిఫికేషన కోసం ఎదురు చూస్తున్నాం. 2020లో టీటీసీ పూర్తి చేశాను. మొదటి సారి డీఎస్సీకి సిద్ధమవుతుఆన్న. టెట్ పరీక్షలో డీఎస్సీకి అర్హత సాధించాను.. ఈ ఆత్మవిశ్వాసంతోనే డీఎస్సీ కోసం కరెంటు అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు మెటీరియల్స్‌ను చదువుతున్నాను.
ఫ జాప్యం లేకుండా డీఎస్సీ నిర్వహించాలి - ఆర్.ప్రతాప్, ఎమ్మెస్సీ, బీఎడ్:
టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసింది. డీఎస్సీ నిర్వహించి ఫలితాలను ప్రకటించి వెంటనే ఉద్యోగాల ఉత్తర్వులు ఇవ్వాలి.