Share News

బుక్‌కీపర్‌ బొక్కేశాడు..!

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:14 AM

పొదుపు గ్రూపు సభ్యుల సొమ్మును బుక్‌కీపర్‌ బొక్కే శాడు. సభ్యులకు తెలియకుండా రూ.4 లక్షలు స్వాహా చేశాడు.

బుక్‌కీపర్‌ బొక్కేశాడు..!
ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నతుంభళం జైనాభీ గ్రూప్‌ సభ్యులు

సభ్యులకు తెలియకుండా రూ.3 లక్షల స్వాహా

లబోదిబోమంటున్న పొదుపు మహిళలు

పెద్దకడబూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పొదుపు గ్రూపు సభ్యుల సొమ్మును బుక్‌కీపర్‌ బొక్కే శాడు. సభ్యులకు తెలియకుండా రూ.4 లక్షలు స్వాహా చేశాడు. దీంతో గ్రూపు మహిళలు లబోదిబోమం టున్నారు. మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో ఓ బుక్‌ కీపర్‌ అవినీతికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొదుపు మహిళల వివరాల మేరకు.. 12 మంది మహిళలు కలిసి 15 ఏళ్ల క్రితం జైనాబీ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. గ్రామా నికి చెందిన బుక్‌ కీపర్‌ 2022లో రూ.10 లక్షల గ్రూపు సభ్యులకు రుణం ఇప్పించాడు. డబ్బును సభ్యులు నెలనెలా చెల్లిస్తూ వచ్చా రు. అయితే పొదుపు మహిళలు ఇచ్చిన రూ.36 వేలను బ్యాంకుకు చెల్లించకుండా బుక్‌కీపర్‌ సొంత ఖర్చులకు వాడుకున్నాడు. సభ్యుల వేలిముద్రలు, సంతకాలు తీసుకొని వారి పేర్లపై 2024 మార్చిలో స్ర్తీనిధి కింద రూ.3 లక్షలు లోన తీసుకొని కాజేశాడు. అలాగే మరో రూ.లక్ష గ్రామైఖ్య సంఘం నుంచి డ్రా చేసుకొని వాడుకున్నాడు. తీసుకున్న మొత్తాన్ని నాలుగు నెలలుగా చెల్లించక పోవడంతో గ్రూపు సభ్యులైన నూర్జాహాజన, తిమ్మలమ్మ, లక్ష్మి, మున్నిబీల పేర్లపై అప్పు ఉందని బ్యాంకు, వెలుగు అధికారులు వారికి తెలిపారు. దీంతో ఖంగుతిన్న సభ్యులు బుక్‌కీపర్‌ను నిలదీ శారు. తమ పేర్లపై వచ్చిన సొమ్ము ఏమైందని, ఎవరు తీసుకున్నారని నిలదీయగా తనకు తెలియ దని బుకాయిం చే ప్రయత్నం చేశాడు. అయితే మహిళలు అందరు కలిసి గ్రామ పెద్దల ముందు ఆధారాలతో చూపించడంతో తానే తప్పు చేశానని ఒప్పుకున్నాడు. డబ్బులను తిరిగి చెల్లిస్తానని చెప్పి కాలం వెళ్లదీస్తున్నాడు. అలాగే లోన్లు మంజూరైన ప్రతిసారి ఒక్కో గ్రూపు నుంచి ఐదారు వేల రూపాయల వరకు వసూలు చేస్తూ వస్తున్నా డని పొదుపు గ్రూపు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్‌ కీపర్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీవో శ్రీనివాసులును వివరణ కోరగా ఈ విషయం వారం క్రితమే తమకు దృష్టికి వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:14 AM