Share News

ఆర్‌ఎంపీ ఇనజక్షనతో బాలుడు మృతి

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:41 PM

గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో బడేసావలి అనే నకిలీ వైద్యుడు వేసిన ఇనజెక్షన వికటించి ఆదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రాజేష్‌ మృతి చెందడంపై బుధవారం డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి, స్థానిక వైద్యులు కార్తీక్‌ విచారణ చేపట్టారు.

   ఆర్‌ఎంపీ ఇనజక్షనతో బాలుడు మృతి
బాలుని అమ్మమ్మ బస్సమ్మను విచారిస్తున్న డీప్యూటీ డీఎంహెచవో సత్యవతి

నకిలీ వైద్యుడిపై డిప్యూటీ డీఎంహెచవో విచారణ

గోనెగండ్ల, జూలై 10: గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో బడేసావలి అనే నకిలీ వైద్యుడు వేసిన ఇనజెక్షన వికటించి ఆదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రాజేష్‌ మృతి చెందడంపై బుధవారం డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి, స్థానిక వైద్యులు కార్తీక్‌ విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి మృతి చెందిన బాలుని అమ్మమ్మ బోయ బస్సమ్మను విచారించి వాస్తవాలను తెలుసుకున్నారు. బాలుడు స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. 15 రోజుల క్రితం రాజేష్‌కు జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు రాజేశ్వరి, నాగరాజు గ్రామంలో ఉన్న బడేసావలి అనే నకిలీ వైద్యుడిని ఆశ్రయించారు. అతడు చేసిన ఇనజెక్షన మూడు రోజులకు వికటించింది. ఇనజెక్షన వేసిన చోటి నుంచి చీము, రక్తం రావడంతో కర్నూలు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆరు రోజలపాటు రూ. 6.50 లక్షలు ఖర్చు చేసుకున్నా నయంగాక మృతి చెందాడని బోయ బస్సమ్మ బోరున విలపిస్తు విచారణలో తెలిపారు. అలాగే వైద్యం చేసిన బడేసావలిని కూడా అధికారులు విచారించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి మాట్లాడుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఇనజెక్షన వేయరాదని అన్నారు. విచారణ జరిపి నివేదికను డీఎంహెచవోకు పంపుతామని ఆయన నిర్ణయం ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 11:42 PM