Share News

AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:16 PM

సాధారణ పరిపాలనా శాఖలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను వారి మాతృశాఖకు బదిలీ చేస్తూ ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ

అమరావతి, జులై 01: సాధారణ పరిపాలనా శాఖలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను వారి మాతృశాఖకు బదిలీ చేస్తూ ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

తిరుపతిలో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.ఈశ్వర్‌రెడ్డిని మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ ఎన్ పూజితకు కడప, అనంతపురం జిల్లాల అదనపు బాధ్యతల తప్పించమే కాకుండా.. డీజీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని ఆమెకు స్పష్టం చేశారు.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్


విజయవాడ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్‌కు తిరుపతి, కర్నూలు జిల్లాల బాధ్యతలను సైతం అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.ఈశ్వర్ రావుకు అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో డీజీ స్పష్టం చేశారు.

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 06:24 PM