Share News

భూమిని రీ సర్వే చేయాలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:10 AM

తమ భూమిని మరోసారి రీసర్వే చేసి అడంగల్‌లో ఎక్కించమని గ్రామ సచివాలయ ఉద్యోగులను అడిగితే లంచం ఇస్తే పని చేస్తామని చెబుతున్నారని తమకు న్యాయం చేయాలని తిప్పనూరు గ్రామ రైతులు మాదన్న, నల్లన్న, అయ్యస్వామి, మధు, కళ్యాణి. కన్నయ్య కోరారు.

  భూమిని రీ సర్వే చేయాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న తిప్పనూరు రైతులు

గోనెగండ్ల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తమ భూమిని మరోసారి రీసర్వే చేసి అడంగల్‌లో ఎక్కించమని గ్రామ సచివాలయ ఉద్యోగులను అడిగితే లంచం ఇస్తే పని చేస్తామని చెబుతున్నారని తమకు న్యాయం చేయాలని తిప్పనూరు గ్రామ రైతులు మాదన్న, నల్లన్న, అయ్యస్వామి, మధు, కళ్యాణి. కన్నయ్య కోరారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిప్పనూరు సచివాలయ ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిపిన రీసర్వేలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరితే సచివాలయ ఉద్యోగులు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ కుమార స్వామికి వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన తహసీల్దార్‌ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.

Updated Date - Nov 24 , 2024 | 12:10 AM