Share News

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:24 PM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్‌ సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న బాలసుబ్రమణ్యం

టీడీపీ ఇన్‌చార్జ్‌ బాలసుబ్రమణ్యం

సుండుపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్‌ సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. గురువారం సుండుపల్లి సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరువు మండలం కావడంతో తాగు, సాగు నీటి సమస్యలపైన ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానన్నారు. రోళ్లమడుగు నుండి మండల ప్రజలకు త్రాగు నీరు అందించేందుకు కావాల్సిన నిధులను తీసుకువచ్చేందు కృషి చేస్తానని తెలిపారు. ఝరికోన నుంచి బాహూదా నది ద్వారా కాలువల మంజూరుకు, అలాగే జి.రెడ్డివారిపల్లి గ్రామంలోని నారాయణరెడ్డి చెరువును నీటితో నింపితో ఆ నాలుగు గ్రామాల్లోని ప్రజలకు తాగు నీటి సమస్య తీరడంతో పాటు బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుందని, సాగు నీటి సమస్యలు వుండవని గ్రామస్తులు కోరారన్నారు. అంతేకాక ఉపాధిలో వచ్చే అర్థిక సంవత్సరంలో 3 లక్షల పనిదినాలు కల్పిస్తున్నట్లు, రైతులకు ఉపయోగపడేలా పనులు గుర్తించామని సంబంధిత అధికారులు వివరించారు. సుండుపల్లి మండలకేంద్రం, మడితాడు కస్వాలో డ్రేనేజి వ్యవస్త సరిగ్గా లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్తులు సమావేశానికి వచ్చి తెలియజేశారు. గుర్తించిన ప్రతి సమస్యను పై అధికారులకు రాత పూర్వకంగా అందజేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఈవో రాధాకృష్ణన్‌, ఏవో మహబూబ్‌ బాషా, ఎంఈవో వెంకటేష్‌నాయక్‌, ఏఈఈ నాగేంద్రనాయక్‌, సర్పంచ్‌ మహ్మద్‌ షరీఫ్‌, ఎంపీటీపీలు నసీమా బాను, నాగేశ్వరి, అమరావతి, సోమశేఖర్‌రెడ్డి, వైద్యాధికారులు హసన్‌అలి, శేఖర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

లక్ష సభ్యత్వాలను పూర్తి చేస్తాం

రాజంపేట, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మహిళామణుల సహకారంతో రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో లక్ష టీడీపీ సభ్యత్వాలను పూర్తి చేస్తామని టీడీపీ ఇన్‌ఛార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామంలో ఆ గ్రామ తెలుగు మహిళల ఆధ్వర్యంలో పెద్దఎత్తున సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ కూచివారిపల్లె గ్రామం లో మహిళలందరూ ముందుకు వచ్చి భారీఎత్తున సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా కూచివారిపల్లె రామాలయంలో సుగవాసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నేతలు గుప్తా శ్రీలత, అమ్మినేని రమాదేవి, మండల మాజీ ఉపాధ్యక్షుడు నరసింహులు, తెలుగు యువత నాయకులు రవినాయుడు, ఆ గ్రామ సీనియర్‌ టీడీపీ నాయకులు వెంకటయ్యనాయుడు, బ్రహ్మయ్యనాయుడు, కిషోర్‌, సిద్దవటం టీడీపీ నాయకులు పుత్తా రామచంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:24 PM