జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:29 AM
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక శాఖ, నంద్యాల జిల్లా ఇనచార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి పత్రం అందజేశారు.
జిల్లా ఇనచార్జి మంత్రి పయ్యావులకు వినతి పత్రం
నంద్యాల కల్చరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక శాఖ, నంద్యాల జిల్లా ఇనచార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం నంద్యాలకు విచ్చేసిన మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖండే శ్యామ్‌సుందర్‌లాల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మానబాషా, ఎలకా్ట్రనిక్ మీడియా అఽధ్యక్షులు చలంబాబులు కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, ప్రెస్‌క్లబ్ కోసం స్థలం కేటాయించాలని, జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. మంత్రులు పయ్యావులు కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, ఎనఎండీ ఫరూక్‌లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.