ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:38 AM
దీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్డూర్ యూనిటీ అసోషియేషన కడప జోనల్ కార్యదర్శి చెన్నారెడ్డి డిమాండ్ చేశారు.
పుట్టపర్తి టౌన, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్డూర్ యూనిటీ అసోషియేషన కడప జోనల్ కార్యదర్శి చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎనఎంయూఏ పుట్టపర్తి డిపో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయక ముందు ఉన్నటు వంటి అపరిమిత, వైద్య సౌకర్యాలను కొన సాగించాలని, పాత పింఛన స్కీమ్‌ను పునరుద్ద రించాలని కోరారు. అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, మెకానిక్ గ్యారెజీలో సాంకేతికకు అనుగుణంగా నూతన పనిముట్లు సరఫరా చేయాలని కోరారు. విజయవాడలో నిర్మిస్తున్న ఎనఎంయూఏ రాష్ట్ర కార్యాలయానికి కార్మికులందరూ సమకరించాలన్నారు.