Share News

‘రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి’

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:47 PM

రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చి హామీలను నెరవేర్చాలని రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

‘రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి’
కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చి హామీలను నెరవేర్చాలని రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ‘శ్రీబాగ్‌ ఒప్పంద దినం’ సందర్భంగా వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ హక్కుల ఉల్లంఘన దినంగా నిరసన ప్రదర్శన చేశారు. వేదిక కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్‌ ముందు గల మహాత్ముని విగ్రహం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వక్తలు మాట్లాడుతూ అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలన్నీ రాయలసీమ పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, ఇక్కడి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాయలసీమ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, రైతుకూలీ సంఘం నాయకుడు సుంకన్న, ప్రజాభ్యుదయ సంస్థ నాయకుడు శ్రీనివాసరావు, కందనోలు కృష్ణయ్య, డేవిడ్‌, రవికుమార్‌, రత్నం ఏసేపు, గద్వాల ఈరన్న, సుబ్బరాయుడు, యోహాను, రాజాసాగర్‌, రోజారమణి, మల్లీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:47 PM