Share News

ఓటు హక్కు వజ్రాయుధం..వైసీపీని గద్దె దించుదాం

ABN , Publish Date - Feb 14 , 2024 | 11:25 PM

యువతకు ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిదని ఈ ఓటుతో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

ఓటు హక్కు వజ్రాయుధం..వైసీపీని గద్దె దించుదాం
సమావేశంలో మాట్లాడుతున్న టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 14: యువతకు ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిదని ఈ ఓటుతో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సొసైటీకాలనిలోని శంకర్‌ నివాసంలో తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మై ఫస్ట్‌ వోట్‌ ఫార్‌ సీబీఎన కార్యక్రం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, ఐటీడీపీ సాగర్‌కుమార్‌, రాధాకృష్ణ, మనోహర్‌ మోహనరెడ్డి రాజశేఖర్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు..

కురబలకోటలో: తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మై ఫస్ట్‌ వోట్‌ ఫర్‌ సీబీ ఎన కార్యక్రమానికి తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత ఉందని, సమర్థవంతమైన నాయకు డు చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్ధతు పలకాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, రాజంపేట పార్లమెంటరీ తెలుగు ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, ఐటీడీపీ విబాగం నాయకులు సాగర్‌కుమార్‌, రాధాకృష్ణ, మోహనరెడ్డి, రాజశేఖర్‌, సోమిరెడ్డి, అమర, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన’ కార్యక్రమం

పీలేరు, ఫిబ్రవరి 14:పీలేరులోని తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు బుధవారం ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన’ పేరుతో అవగాహన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీచైత న్య, మార్గదర్శి డిగ్రీ కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో టీఎనఎస్‌ఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి అబ్బూరి చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు లభించాయ న్నారు. వైసీపీ అరాచక పాలన కారణంగా రాష్ట్రంలోని విద్య, ఉపాధి రంగాలు 30 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాయన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, బాధ్యతగా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో చంద్రబా బుకు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమాల్లో రాజంపేట పార్లమెంటు టీఎనఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ముబారక్‌, పీలేరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్టీఆర్‌ నఫీస్‌, తెలుగు యువ త నాయకులు క్రాంతి, రెడ్డిముని, సాధిక్‌, శ్రీనివాసులు, అబ్దుల్లా, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 11:25 PM