Share News

కార్గిల్‌ అమరవీరుల త్యాగాలు మరవలేనివి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:00 AM

కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణా లర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివ

కార్గిల్‌ అమరవీరుల త్యాగాలు మరవలేనివి

కురబలకోట, జూలై 26: కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణా లర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని మిట్స్‌ ఇంజ నీరింగ్‌ కళాశాల డీన తులసీరామ్‌నాయుడు పేర్కొన్నారు. శుక్రవా రం కళాశాల ఎనసీసీ విభాగం ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచే యకుండా విరోచితంగా పోరాడి సైనికులు తమ ప్రాణాలను అర్పించారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్‌ నవీనకుమార్‌, ఎనఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

పీలేరులో: పీలేరులోని పలు విద్యాసంస్థల్లో కార్గిల్‌ దివస్‌ను ఘ నంగా నిర్వహించారు. సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ .సుధాకర్‌ రెడ్డి మాట్లాడు తూమన దేశ సైనికుల వీరత్వానికి ప్రతీకగా కార్గిల్‌ యుద్ధం నిలిచిందన్నారు. ఆ యుద్ధంలో వందలాది మంది సైనికులు ప్రాణత్యాగం చేసి మన భూభాగాన్ని కాపాడారన్నారు. ఆ సైని కుల వీర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి విద్యార్థులు దేశం కోసం పాటుపడాలన్నారు. అనంతరం కార్గిల్‌ యుద్ధంలో ప్రాణా లు కోల్పోయిన వీరసైనికులకు సంబంధించిన డాక్యుమెంటరీలను కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కోసం ప్రదర్శించారు. పాత బస్టాండు లోని జడ్పీ మెయిన పాఠశాలలో కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా నివాళు లర్పించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో డిగ్రీ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ శివరామిరెడ్డి, అసోసియేట్‌ ఎనసీసీ ఆఫీసర్‌ లెఫ్టి నెంట్‌ డాక్టర్‌ కవెంకటరమణయ్య, ఎంఈవో లోకేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఐ రమణ, మెయిన స్కూల్‌ హెచఎం సురేంద్రనాథరెడ్డి, ఎనసీసీ ఆఫీసర్‌ జయపాల్‌రెడ్డి, క్యాడెట్స్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బనలో: స్థానిక సొసైటీ కాలనీలోని విజయభారతీ ఇంగ్లీష్‌మీడియం హైస్కూల్‌లో శుక్రవారం కార్గిల్‌ విజయ దివస్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కార్గిల్‌ లో విజయం సాధించిన భారత సైనికులు చిత్రపట్టాలకు ఆ స్కూ ల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన సేతు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు బండి ఆనంద్‌, గుడ్‌విల్‌ కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడు అజయ్‌లు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

పెద్దతిప్పసముద్రంలో: మండల కేంద్రమైన పీటీఎంలోని బస్టాండులో కార్గిల్‌ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్ల చిత్రపటాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరులను గుర్తించుకుని వారికి నివాళులర్పించడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో బీజేపీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి శివయ్య, టీడీపీ నాయకులు నందిమూర్తి, రామకృష్ణ, కిరణ్‌కు మార్‌, జనసేన నాయకులు ముద్దసాని నాగ రాజు, గౌండర్‌ రెడ్డెప్ప, ఆంజనేయులు, హోటల్‌ మంజు, శివన్న పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:00 AM