Share News

ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:22 AM

ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవ గాహన కలిగి ఉండాలని శిరివెళ్ల పీహెచసీ వైద్యుడు ముఖేష్‌, సీహెచవో రామ్మోహనరెడ్డి అన్నారు.

 ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
శిరివెళ్లలో ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది

శిరివెళ్ల, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవ గాహన కలిగి ఉండాలని శిరివెళ్ల పీహెచసీ వైద్యుడు ముఖేష్‌, సీహెచవో రామ్మోహనరెడ్డి అన్నారు. ఎయిడ్స్‌ దినోత్సవంలో భాగంగా శిరివెళ్లలోని పీ హెచసీ నుంచి సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని అన్నారు. హెచఐవీకి చికిత్స లేదని నివారణ ఒక్కటే మా ర్గమని వారు తెలిపారు. ప్రజల్లో ఎయిడ్స్‌ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

కొలిమిగుండ్ల : ఎయిడ్స్‌ మహమ్మారిపై లారీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని రామ్‌కో పరిశ్రమ వైద్యుడు శశిధర్‌ అన్నారు. సోమవారం రామ్‌కో యూనిట్‌ హెడ్‌ రెడ్డి నాగరాజు ఆదేశాలమేరకు పరిశ్రమ ఆవరణంలో ఎయిడ్స్‌ వ్యాధి పట్ల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్ర మంలో ఫార్మాసిస్టు నరేంద్ర, వైద్య సిబ్బంది ప్రతాప్‌, రామ్‌కో భరతరెడ్డి, డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:22 AM