ప్రాణాధారం పనికిరాకుండా..!
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:39 AM
ఈ చిత్రంలో మూలనపడేసినట్లున్న ఈ పరికరాలు ప్రాణాధారమైన వెంటిలేటర్లు. అక్షరాల నాలుగున్నర కోట్ల రూపాయలు వెచ్చించి వీటిని కొన్నారు.
ఈ చిత్రంలో మూలనపడేసినట్లున్న ఈ పరికరాలు ప్రాణాధారమైన వెంటిలేటర్లు. అక్షరాల నాలుగున్నర కోట్ల రూపాయలు వెచ్చించి వీటిని కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా వదిలేసిన ఈ వెంటిలేటర్‌లు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. అత్యవసర పరిస్థితిలో రోగులకు కృత్రిమ శ్వాస అందించే ఈ పరికరాలు ఎవరికీ పట్టకుండా పాడైపోతున్నాయి. దాదాపు 90 వెంటిలేటర్లు వినియోగించకుండా ఇలా పక్కన పడేశారు. వీటిని వెంటిలేటర్లు అవసరం ఉన్న ఆస్పత్రులకు తరలిస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది.
- నరసరావుపేట, ఆంధ్రజ్యోతి