Share News

లెబనాన్‌లో తుపాకీ పేలి ప్రవాసాంధ్రుడి మృతి

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:12 AM

గల్ఫ్‌కు చెందిన తన యజమాని వద్ద పనిచేసే క్రమంలో తుపాకీని శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు మరణించాడు. ఈ ఘటన లెబనాన్‌లో

లెబనాన్‌లో తుపాకీ పేలి ప్రవాసాంధ్రుడి మృతి

మృతుడు ఖతర్‌లో అత్యంత సంపన్నుడి వ్యక్తిగత సిబ్బంది

మృతుడి స్వగ్రామం కాళ్ల మండలం కొలనపల్లి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌కు చెందిన తన యజమాని వద్ద పనిచేసే క్రమంలో తుపాకీని శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు మరణించాడు. ఈ ఘటన లెబనాన్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కొలనపల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల యాల్ల జాన్‌ డేవిడ్‌.. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఖతర్‌లోని ఒక ప్రముఖ అరబ్బు కుటుంబ వ్యక్తిగత సిబ్బందిగా పని చేస్తున్నాడు. ఆ కుటుంబానికి అత్యంత విశ్వసనీయపాత్రుడిగా పని చేసే డేవిడ్‌.. యజమాని వెంట తరచూ ఇతర దేశాలకూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం లెబనాన్‌కు వెళ్లి అక్కడ పని చేస్తున్నాడు. గత వారం యాజమాని ఇంట్లో సామాన్లతో పాటు తుపాకీని శుభ్రపరుస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలిపోయి డేవిడ్‌ మరణించాడని సమాచారం. ఘటనపై పూర్తిస్థాయిలో పోలీసు, వైద్య నివేదికలు ఇంకా భారతీయ ఎంబసీకి అందలేదు. వీలైనంత త్వరగా మృతుని కుటుంబానికి న్యాయం చేకూర్చే విధంగా భారతీయ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Dec 03 , 2024 | 05:12 AM