అనంతలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:34 AM
అనంతపురం జిల్లాలో అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన రైతు మిద్దె గోపాల్ రెడ్డి(59) తనకున్న ఐదు ఎకరాల పొలంలో ఆరేళ్ల క్రితం చీనీ మొక్కలు నా టాడు.
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు/కూడేరు, ఏప్రిల్ 2: అనంతపురం జిల్లాలో అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన రైతు మిద్దె గోపాల్ రెడ్డి(59) తనకున్న ఐదు ఎకరాల పొలంలో ఆరేళ్ల క్రితం చీనీ మొక్కలు నా టాడు. సాగునీటి కోసం ఎనిమిది బోరుబావులు తవ్వించారు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.15 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పేరుకుపోయాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరివేసుకున్నాడు. పెద్దపప్పూ రు మండలం ముచ్చుకోట గ్రామానికి చెం దిన నల్లయ్య(54) నాలుగు ఎకరాల్లో కరివేపాకు సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రూ.8 లక్షలదాకా అప్పు చేశాడు. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు, ధర కూడా పతనమైంది. ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన నల్లయ్య మృతదేహాన్ని మంగళవారం గ్రామంలోని ఓ అరటితోటలో గుర్తించారు. కూడేరు మండ లం కడదరకుంట గ్రామానికి సంగప్ప(35) ఐదారు సంవత్సరాలుగా భూములను కౌలుకు తీసుకుని వేరుశనగ, వరి, ఆ ముదం తదితర పంటలు సాగు చేస్తున్నాడు. దిగుబడి సక్రమంగా రాకపోవడంతో నష్టపోయాడు. పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చేమార్గంలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.