Tirupati: పది నెలల బాలుడి గొంతులో ఇరుక్కున్న బ్యాటరీ..
ABN , Publish Date - Dec 18 , 2024 | 10:59 AM
రిమోట్(Remote)లకు ఉపయోగించే బ్యాటరీతో పది నెలలు బాలుడు ఆడుకుంటూ మింగడంతో గొంతులో ఇరుక్కుపోయింది. స్విమ్స్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగం(SVIMS Gastroenterology Department) ఆధ్వర్యంలో అతిక్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి బ్యాటరినీ తొలగించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మంగళవారం తెలిపారు.
- స్విమ్స్‌లో శస్త్ర చికిత్సతో తొలగింపు
తిరుపతి: రిమోట్(Remote)లకు ఉపయోగించే బ్యాటరీతో పది నెలలు బాలుడు ఆడుకుంటూ మింగడంతో గొంతులో ఇరుక్కుపోయింది. స్విమ్స్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగం(SVIMS Gastroenterology Department) ఆధ్వర్యంలో అతిక్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి బ్యాటరినీ తొలగించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మంగళవారం తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన ఈ బాలుడిని కుటుంబ సభ్యులు స్విమ్స్‌కు తీసుకొచ్చారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Leopard: వామ్మో.. చిరుత ఎంత దర్జాగా తిరుగుతోందో..
గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివరామకృష్ణ(Dr. Shivaramakrishna) ఆధ్వర్యంలో వైద్యుల పర్యవేక్షణలో అధునాతన వైద్య పరిజ్ఞానంతో బాలుడికి శస్త్ర చికిత్స చేశామన్నారు. అనంతరం బాలుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడంతో మంగళవారం బాలుడ్ని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటరామిరెడ్డి, చంద్రమౌళీశ్వరన్, మనోజ్‌కృష్ణ, తేజస్విని, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News