Share News

Tirupati: ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో ‘అన్యమత’ కలకలం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:35 PM

ఎస్వీయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ(SV University Engineering College)లో సోమవారం అన్యమత ప్రచారంపై కలకలం రేగింది. ఈఈఈ విభాగ ప్రొఫెసర్‌ సీహెచ్‌ చెంగయ్య మత ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్‌దళ్‌, ఏబీవీపీ ఆరోపించాయి.

Tirupati: ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో ‘అన్యమత’ కలకలం

- ప్రచారం చేస్తున్నారంటూ ఓ ప్రొఫెసర్‌పై భజరంగదళ్‌, ఏబీవీపీ ఆరోపణ

తిరుపతి: ఎస్వీయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ(SV University Engineering College)లో సోమవారం అన్యమత ప్రచారంపై కలకలం రేగింది. ఈఈఈ విభాగ ప్రొఫెసర్‌ సీహెచ్‌ చెంగయ్య మత ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్‌దళ్‌, ఏబీవీపీ ఆరోపించాయి. యూనివర్సిటీ, కాలేజీ జారీ చేసే సర్క్యులర్‌పైన ‘ప్రైజ్‌ ద లార్డ్‌’ అని రాయడాన్ని వారు తప్పుపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భజరంగ్‌దళ్‌ నాయకులు విష్ణు ప్రతీక్‌ రెడ్డి, కిరీటి, ఏబీవీపీ నాయకులు పూజారి రాఘవేంద్ర, సురేంద్ర తదితరులు ఇంజినీరింగ్‌ కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’


ప్రొఫెసర్‌ చెంగయ్య చాంబరులోకి వెళ్లి వర్సిటీలో మత ప్రచారం ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆయన్ను చొక్కా పట్టుకొని బయటకు తీసుకొచ్చిన వారు.. ఇటుకలతో కారుపై దాడి చేశారు. అనంతరం వారు ఎస్వీయూ ఇన్‌చార్జి వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా, హెడ్‌ రూములో కుర్చీ వెనుక గల వేంకటేశ్వర స్వామి పటాన్ని తొలగించారని, స్టూడెంట్స్‌, ఎంప్లాయీస్‌ ఉన్న వాట్సప్‌ గ్రూప్‌లలో ఏసు స్తోత్రాలు, వీడియోలు పంపుతున్నారని ప్రొఫెసర్‌ చెంగయ్యపై ఫిర్యాదులు వచ్చాయి.


మహిళా ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో కమిటీ

కాగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మత వివక్ష చూపుతున్నారని ప్రొఫెసర్‌ చెంగయ్యపై మహిళా ప్రొఫెసర్‌ ఉషారెడ్డి వీసీ, రిజిస్ట్రార్‌కు మౌఖిక ఫిర్యాదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ ద్వారా ఫిర్యాదు వస్తేనే తాము పరిశీలిస్తామని వారు చెప్పినట్టు తెలిసింది. దీంతో ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులుకు ఆమె ఫిర్యాదు చేశారు. వృత్తిపరమైన వేధింపులకు గురి చేస్తున్నారనీ, రాత్రి దాకా తమను విభాగంలోనే ఉండేలా చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

nani4.jpg


దీంతో వైస్‌ ప్రిన్సిపాల్‌ సుబ్బారావు నేతృత్వంలో ఐదుగురు మహిళా ప్రొఫెసర్లతో ఆయన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. లేడీ ఫ్యాకల్టీతో పాటు ఈఈఈ విభాగానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులందరిని ఈ కమిటీ విచారిస్తుందని ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తెలిపారు. కాలేజీ కౌన్సిల్‌లోనూ దీనిపై చర్చించామని, విచారణలో భాగంగా ప్రొఫెసర్‌ చెంగయ్యను పిలిచి మాట్లాడినట్లు చెప్పారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2024 | 12:35 PM