Share News

AP: ఏపీలో తెలుగు మాధ్యమంలో బోధనను పునరుద్ధరించాలి: ఏపీ సీఎంకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడి వినతి

ABN , Publish Date - Jul 04 , 2024 | 03:42 PM

తమిళనాట తెలుగు భాషను కాపాడుకునేందుకు పోరాడుతున్న తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. మాతృభాషాను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సాయం అర్థించారు. ఏపీలో ఇంటర్మీడియట్ వరకూ అన్ని తరగతుల్లో తెలుగు మాధ్యమంలో బోధనను తక్షణం పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

AP: ఏపీలో తెలుగు మాధ్యమంలో బోధనను పునరుద్ధరించాలి: ఏపీ సీఎంకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడి వినతి

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట తెలుగు భాషను కాపాడుకునేందుకు పోరాడుతున్న తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. ఆ దిశగా ఏపీ (Andhrapradesh) సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) సాయం అర్థించారు. ఏపీలో ఇంటర్మీడియట్ వరకూ అన్ని తరగతుల్లో తెలుగు మాధ్యమంలో బోధనను తక్షణం పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు (Restoration of Telugu as Medium of Instruction). తద్వారా తమిళనాట తెలుగు కోసం పోరాడుతున్న తమకు నైతిక మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలుగులో బోధనకు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారీ ఏపీలోనే లేనిది తమిళనాట ఎందుకున్న ప్రశ్న తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Deputy CM Pawan: పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా!


మాతృభాషలో బోధనకు జాతీయ విద్యా విధానం కూడా మద్దతు తెలుపుతున్న విషయాన్ని తెలుగు యువశక్తి అధ్యక్షుడు ప్రస్తావించారు. ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలూ దీనికి మద్దతు పలికియాన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉండే అన్ని కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోనూ, అన్ని స్థాయిలలోనూ తెలుగే వాడాలని అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజలభాష వాడాలని, వాదోపవాదాలకు, తీర్పులకు ప్రజలభాషే వాడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి పిల్లల విద్యాభ్యాసం కోసం జనాభా దామాషా ప్రకారం పాఠశాలలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాప్రైవేటీకరణకు, ఇంగ్లీషు మాధ్యమ చదువులకు మధ్య విభజించటానికి వీలులేనట్లుగాఉన్న లంకెను తక్షణమే విడదీయాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు విద్యాలయాలు కూడా తెలుగు మాధ్యమంలోనే బోధన సాగించేలా చూడాలన్నారు. ఈ నిబంధనను పాటించని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. తమిళ రాష్ట్రంలోని నేటి తరం తెలుగు పిల్లలకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం కూడా రాని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రంలో ఈ దుస్థితి ఎప్పుడూ రాకూడదన్నదే తమ ప్రగాఢ వాంఛ అని అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎంకు వినతిపత్రం సమర్పించారు. 1 (2)-1_page-0001_1_11zon.jpg1 (2)-2_page-0001_2_11zon.jpg1 (2)-3_page-0001_3_11zon.jpgRead Andhrapradesh and Telangana News

Updated Date - Jul 04 , 2024 | 04:11 PM