AP News: నటి జెత్వానీ కేసులో హైకోర్టులో నేటి విచారణ పూర్తి.. అప్‌డేట్ ఏంటంటే..
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:46 PM
ముంబై నటి కాదంబరి జెత్వానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకొచ్చి.. ఒక గెస్ట్ హౌస్‌లో ఉంచి మరీ వేధించారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందిత ఐపీఎస్ అధికారులు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకొచ్చి.. ఒక గెస్ట్ హౌస్‌లో ఉంచి మరీ వేధించారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ బాగోతం మొత్తం బయటపడింది. జెత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వేధింపుల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ప్రమేయం కూడా ఉందని తేలింది. కేసులో నిందితులుగా కూడా చేర్చారు. దీంతో నిందిత ఐపీఎస్ అధికారులు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (గురువారం) విచారణ జరిగింది.
ఐపీఎస్ అధికారుల బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం వాయిదా నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 26న చేపట్టనున్నట్టు ప్రకటించింది.
కాగా జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు వైసీసీ పెద్దల కోసం నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురిచేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు తెలుగు రాష్ట్రాలను విస్మయానికి గురిచేసింది.
సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలనే నిబంధన ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహిళలను విచారించాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలన్నీ జెత్వానీ విషయంలో తుంగలో తొక్కారు. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్ తీసుకుని ముంబై వెళ్లి ఆమెను తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే.